తెలంగాణ

telangana

ETV Bharat / briefs

యూఎస్ ఓపెన్​ నుంచి సుమిత్ నిష్క్రమణ

యూఎస్ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ టోర్నీ నుంచి భారత ఆటగాడు సుమిత్ నగాల్​ నిష్క్రమించాడు. తొలి రౌండ్​లోనే 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో రోజర్​ ఫెదరర్​ చేతిలో ఓడిపోయాడు.

By

Published : Aug 27, 2019, 9:44 AM IST

Updated : Sep 28, 2019, 10:28 AM IST

సుమిత్

ఫెదరర్​పై పోరాడి ఓడిన సుమిత్

అమెరికా న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్​లో భారత సంచలనం సుమిత్ నగాల్ పోరాడి ఓడాడు. రోజర్​ ఫెదరర్​తో జరిగిన తొలి రౌండ్​ మ్యాచ్​లో మొదటి సెట్ గెలిచిన సుమిత్.. తర్వాతి సెట్లలో వరుసగా పరాజయం చెందాడు.

ఫెదరర్​తో జరిగిన మ్యాచ్​లో 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి సెట్​లో ఫెదరర్​కు చెమటలు పట్టించిన సుమిత్ అనంతరం రోజర్​ ధాటికి తట్టుకోలేకపోయాడు. ఫెదరర్ అనుభవం, దూకుడు ముందు నిలువలేకపోయాడు.

పిన్నవయసులోనే భారత నుంచి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్​మెయిన్​ డ్రాకు అర్హత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సుమిత్. యూఎస్ ఓపెన్​​ మొదటి సెట్​లో ఫెదరర్​పై నెగ్గిన తొలి భారత ఆటగాడిగానూ ఘనత సాధించాడు.

శుక‍్రవారం జరిగిన చివరి క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో నాగల్‌ 5-7, 6-4, 6-3 తేడాతో జోవా మెనిజెస్‌(బ్రెజిల్‌)పై గెలిచి.. యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు సుమిత్​.

ఇది చదవండి: 'సాండ్ ఆర్ట్'​తో సింధుకు శుభాకాంక్షలు

Last Updated : Sep 28, 2019, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details