గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్నును జరిమానా లేకుండా ఈనెల 30లోపు చెల్లించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లిడించారు. 2019-20 ఆర్థిక ఏడాదికి 14 లక్షల 50 వేల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు రూ. 1800 కోట్లు చెల్లించాల్సి ఉందని.. కానీ ఇప్పటి వరకు రూ. 630 కోట్లు మాత్రమే కట్టారని తెలిపారు. ఇప్పటికీ.. చెల్లించని వారు తమ ఆస్తిపన్నును ఈనెలఖారు లోపు చెల్లించాలని.. లేనిపక్షంలో జులై 1 నుంచి 2 శాతం పెనాల్టీ విధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ఆదివారం జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటీజన్ సర్వీస్ సెంటర్లు పనిచేస్తాయని అందులో ఆస్తిపన్నును చెల్లించాలని నగర వాసులకు దానకిషోర్ సూచించారు.
ఆస్తిపన్ను చెల్లించకపోతే.. పెనాల్టీ తప్పదు
2019-20 ఆర్థిక ఏడాదికి 14 లక్షల 50 వేల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు రూ. 1800 కోట్లు చెల్లించాల్సి ఉందని.. కానీ ఇప్పటివరకు రూ. 630 కోట్లు మాత్రమే కట్టారని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు.
పెనాల్టీ తప్పదు