తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇంటర్​ ప్రభావం పడకుండా టెన్త్​ విద్యార్థులకు కౌన్సిలింగ్​ - COUNSILING_FOR_SSC_STUDENTS

పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి ముందు, ఆ తర్వాత విద్యార్థులు, తల్లిందండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 9 లేదా 10 న మొదటి సమావేశం నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది. కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన తీరుపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు వివరిస్తూ... ఫెయిలైన వారు కుంగిపోకుండా భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

విద్యార్థులు, తల్లిందండ్రులకు కౌన్సిలింగ్

By

Published : May 7, 2019, 9:37 AM IST

విద్యార్థులు, తల్లిందండ్రులకు కౌన్సిలింగ్

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో... పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. పదో తరగతి ఫలితాల వెల్లడికి ముందు... ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులతో పాటు... మానసిక నిపుణులు, కెరీర్ గైడెన్స్ నిపుణులను సమావేశాలకు పిలుస్తారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 11,023 పాఠశాలల నుంచి విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తయినప్పటికీ... ముందు జాగ్రత్తగా పలు జవాబు పత్రాల రీవెరిఫికేషన్ చేస్తున్నారు.

అంచనాలు వద్దు

ఈనెల 9 లేదా 10వ తేదీల్లో పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ప్రతిభ స్థాయి.. ఫలితాలు ఏ స్థాయిలో ఉండొచ్చునో వివరించి.. పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా తగిన సూచనలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయలకు విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది.

భరోసా కల్పించండి

ఫలితాలు వెల్లడించిన వెంటనే మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు జరపాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశించింది. ఫెయిలైన విద్యార్థులు కుంగిపోకుండా... భరోసా కల్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షపై అవగాహన కల్పించి... వారు ఫీజు చెల్లించేలా వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని హెచ్ఎంలకు సూచించింది.

అభిరుచి మేరకే కోర్సులు ఎంచుకోండి

పదో తరగతి ఫెయిలైనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదని... చదువుకోవడానికి సార్వత్రిక విద్యా విధానంతో పాటు అనేక మార్గాలున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించాలని పేర్కొంది. ఉత్తీర్ణులైన విద్యార్థులకు తదుపరి విద్యావకాశాలపై గైడెన్స్ ఇస్తారు. తమ అభిరుచి మేరకే కోర్సులను ఎంచుకోవాలని... ఇతరులను చూసి తొందరపడి తర్వాత ఇబ్బంది పడవద్దనే అంశాన్ని ప్రధానంగా వివరించారు. పదోతరగతి తర్వాత ఏయే విద్యావకాశాలున్నాయో వివరిస్తారు.

ఇదీ చూడండి: జడ్పీటీసీ పదవికి తెరాస-కాంగ్రెస్​ల హైడ్రామా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details