'పార్టీ మారిన ఎమ్మెల్యేలను.. చీపురుతో కొట్టాలి'
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమర్క చేస్తున్న ఆమరణ దీక్షను బలవంతంగా విరమింపచేయడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో చీపుర్లు పట్టుకుని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ నేతల ఆందోళన
జగిత్యాలలో కాంగ్రెస్ నేతలు చీపుర్లు పట్టుకుని ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసుల వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ తెలంగాణలో ఇలా వ్యవహరించడం సరికాదని నేతలు ఆరోపించారు. కేసీఆర్కు త్వరలో పతనం ఖాయమని.. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను చీపుర్లతో కొట్టాలని నినాదాలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.