తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎన్నికల్లో ప్రజలు తెరాసకు బుద్ధి చెప్పారు: ఉత్తమ్

రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. భాజపాకు దక్కిన నాలుగు ఎంపీ సీట్లు అదృష్టం కొద్దీ గెలినవేనని అన్నారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఎంపీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిలను కాంగ్రెస్ శ్రేణులు సత్కరించాయి.

congress

By

Published : May 28, 2019, 12:27 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనైతికంగా తెరాసలో చేర్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ అనైతిక చర్యలకు లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో తెరాస ఏ ఒక్కటీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేలా కేంద్రంపై పోరాడుతామని వెల్లడించారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు కోసం ఎన్డీఏపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. రాహుల్‌గాంధీ నాయకత్వంపై సంపూర్ణ నమ్మకం ఉందని... ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్‌ గాంధీయే కొనసాగాలని కోరారు. ఈ విషయమై ఉత్తమ్​ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details