నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని లక్ష్మీ 70ఎంఎం థియేటర్లో మహర్షి చిత్ర బృందం సందడి చేసింది. పుట్టి పెరిగిన ఊరిలో, సొంత సినిమా హాల్లో రైతుల సమస్యపై తీసిన చిత్రాన్ని గ్రామస్థులతో కలిసి చూడటం ఆనందంగా ఉందని దర్శకుడు పైడిపల్లి వంశీ హర్షం వ్యక్తం చేశారు. యువ రైతులను చిత్ర బృందం సన్మానించింది. రైతుల కోసం ఉచితంగా సినిమా ప్రదర్శించారు. తన చిన్నతనం మొత్తం ఇదే సినిమా హల్లో గడిచిందని ఆనాటి అనుభవాలను వంశీ గుర్తు చేసుకున్నారు. తాను దర్శకుడు కావడానికి బీజం పడటానికి కారణం ఈ సినిమ హాలేనని వంశీ తెలిపారు. ఈ గ్రామాన్ని ఎన్నటికీ మరువలేనని పేర్కొన్నారు. మహర్షి చిత్రాన్ని ఆదరించి ఇంత విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఙతలు తెలిపారు.
వంశీ సొంత ఊళ్లో 'మహర్షి' చిత్ర బృంద సందడి
చిన్నతనంలో ఎన్నో సినిమాలు చూసిన థియేటర్లోనే... ప్రస్తుతం తాను దర్శకత్వం వహించిన రైతుల సినిమాను అదే హాల్లో కర్షకుల మధ్య కూర్చొని చూస్తే వచ్చే అనుభవం వర్ణించలేనిది. అలాంటి భావోద్వేగానికే లోనయ్యారు మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి. సొంత ఊరు, థియేటర్‌తో తనకున్న చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
చిన్ననాటి అనుభవాలను