సొంత బావనే మోసం చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. బెంగళూరుకు చెందిన కాంతిలాల్ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్‌లో అతని సంబంధించిన వ్యాపార వసూళ్లు బావమరిది అర్జున్ సింగ్ రాజ్‌పుత్ చూసేవాడు. వ్యాపారానికి సంబంధించిన 50 లక్షలు వసూలు చేసి బెంగళూరులో ఉన్న కాంతిలాల్‌కు పంపేందుకు ఓ వ్యక్తికి అందజేశాడు. ఆ వ్యక్తి డబ్బులు తీసుకొని నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.
జల్సాలకు అలవాటు పడి సొంత బావకే టోపీ - money
జల్సాలకు అలవాటు పడ్డాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తన బావనే మోసం చేయాలని స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించాడు. అది బెడిసి కొట్టి కటకటాలపాలయ్యాడు.
ద్విచక్రవాహనంపై నలుగురు వ్యక్తులు వచ్చి... తాము పోలీసులమని చెప్పి.. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనంటూ.. బెదిరించి డబ్బు లాక్కొని వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన సదరు వ్యక్తి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అర్జున్ సింగే అసలు దోషి అని తేలింది. అతని నలుగురు స్నేహితులు రాజ్‌పుత్ ఉదమ్ సింగ్, భవర్సింగ్ రాజ్‌పుత్, ప్రవీణ్‌సింగ్, విక్కీ రాజ్‌పుత్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 46 లక్షల 36 వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: తీలేరు ఘటనపై సుమోటో కేసు నమోదు