గాజుల పరిశ్రమల్లో పని కోసమేనా..?
బాలకార్మికుల అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మార్పు రావడం లేదు. మైనర్లతో పరిశ్రమల్లో పనిచేయించవద్దని ఎన్ని సార్లు చెప్పినా వాళ్ల పద్ధతి మారదు. బిహార్ నుంచి బాల కార్మికులను తీసుకొస్తూనే ఉన్నారు. ఇలాగే వచ్చిన 60 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు.
వీరిని పాతబస్తీలోని గాజుల పరిశ్రమల్లో పని చేయించేందుకు తీసుకొచ్చారన్న సమాచారంతో.. అందరి దగ్గర ఆధార్, ఇతర వివరాలను పరిశీలించారు. వచ్చిన వారిలో సుమారు 60మంది మైనర్లను గుర్తించారు. విచారణ అనంతరం వీరిని తరలించిన వారిపై చర్యలు తీసుకుంటామని గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
అంతర్రాష్ట్ర వలసల విధానం ప్రకారం వీరందరికి బిహార్ ప్రభుత్వ నుంచి అనుమతి ఉండాలని.. పూర్తిగా విచారించిన తర్వాతే బాలలందరిని జువైనల్ హోంకు తరలిస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:అంచనాలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఫలితాలు