తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వైద్యం చేయించుకున్నారు... కుచ్చుటోపి పెట్టారు...!

వైద్యం కోసం వచ్చారు. ఆరోగ్యం కుదుట పడగానే ఆ వైద్యునితోనే స్నేహం పెంచుకుని వాళ్లు చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టించుకున్నారు. కొన్నిరోజులకు లాభనష్టాలపై ఆరా తీస్తే... అసలు విషయం బయటపడింది. ఏకంగా కోటీ నలభై లక్షలు రూపాయలు కుచ్చుటోపి పెట్టారని తెలుసుకుని నివ్వెరపోవటం ఆ అమాయక వైద్యుని వంతైంది.

CHEATING CASE

By

Published : Jun 22, 2019, 5:27 AM IST

Updated : Jun 22, 2019, 8:26 AM IST

కోటీ నలభై లక్షల కుచ్చుటోపి

రాయితీ విత్తనాల వ్యాపారం పేరుతో ఓ వైద్యుడికి ఏకంగా రూ.కోటి నలభై లక్షల కుచ్చుటోపి పెట్టారు ఇద్దరు మోసగాళ్లు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గుండె వ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్న వైద్యుడి వద్దకు జూబ్లీహిల్స్​కి చెందిన పట్టాభి, పాండా వైద్యం కోసం వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల వైద్యుడితో స్నేహం పెంచుకున్నారు. రాయితీ విత్తనాల వ్యాపారం చేస్తున్నట్లుగా వైద్యుడిని నమ్మించారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ సంస్థ నుంచి రాయితీ విత్తనాలు కొని పశ్చిమ బంగ ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నామని ఒప్పంద పత్రాలు చూపించారు. పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరారు. నిందితుల మాటలు నమ్మిన వైద్యుడు రెండేళ్ల క్రితం వీరి ఖాతాకు కోటి నలభై లక్షల రూపాయలు బదిలీ చేశాడు.

ఆరా తీస్తే బయటపడ్డ అసలు విషయం...

నెలలు గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోయేసరికి 2017లో సదరు వైద్యుడు పట్టాభి, పాండాలను నిలదీశాడు. కొంత సమయం అడిగినా... గడువు లోపల డబ్బు ఇవ్వకపోవటం వల్ల అనుమానం వచ్చిన వైద్యుడు వ్యాపార ఒప్పంద పత్రాలపై ఆరా తీశాడు. నకిలీవని తేలంటం వల్ల మోసపోయినట్లు నిర్ధారించుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పట్టాభి, పాండాతో పాటు... నగదు బదిలీ చేయించిన చామర్తి, భావన, అజయ్​పైనా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి: 1.12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగే లక్ష్యంగా

Last Updated : Jun 22, 2019, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details