అసలేం జరిగిందంటే...
'ఆవు వయసు' రేటు రూ. 600 - health certificate
ఆవు వయసు తెలుసుకోవాలంటే.. అక్కడి పశువైద్యాధికారికి రూ.600 లంచంగా ఇవ్వాల్సిందే. అలా ఓ వ్యక్తి తన దగ్గరున్న 12 ఆవుల వయసు నిర్ధరణ కోసం... రూ.7వేల 200 ఇవ్వాల్సిందిగా వైద్యుడు కోరాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
'ఆవు వయసు' రేటు రూ. 600
గ్రామానికి చెందిన హన్మంత్‌రెడ్డికి 12 ఆవులు ఉన్నాయి. వాటికి బీమా చేయించేందుకు గత 50 రోజులుగా పశువుల ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యుడు డబ్బు డిమాండ్ చేశాడు. ఒక్కో ఆవుకు 600 చొప్పున 12 ఆవులకు 7వేల 200 ఇవ్వాల్సిందిగా కోరాడు. రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా... అధికారులు వైద్యాధికారిని పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
ఇవీ చూడండి:కేంద్రంలో మేమే కీలకం