తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బీజాపుర్​లో ఎన్​కౌంటర్​..10 మంది నక్సల్స్​ హతం

ఛత్తీస్​గఢ్ బీజాపుర్​లో గురువారం ఉదయం భారీ ఎన్​కౌంటర్​ జరిగింది.

ఆయుధాలు స్వాధీనం

By

Published : Feb 7, 2019, 2:18 PM IST

ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్​లో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా బలగాల చేతిలో 10 మంది నక్సలైట్లు హతమయ్యారు. నక్సల్స్​ ఏరివేత చేపట్టిన పోలీసులు నక్సల్స్​ను అంతమొందించారు. ఘటనా స్థలం నుంచి 11 ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిపిన ఎన్​కౌంటర్లో జిల్లా రిజర్వ్​ గార్డు, ప్రత్యేక కార్య దళం పాల్గొన్నాయి. భైరంగఢ్​ పోలీస్​ స్టేషన్​ సమీపంలో ఈ ఆపరేషన్​ నిర్వహించారు.

''ఘటనా స్థలం నుంచి 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 11 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ''

- బీజాపుర్​ ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details