తెరాస ప్రభుత్వం అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి నుంచి ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. హస్తం గుర్తు మీద గెలిచి తెరాసలోకి వెళ్లినవారి శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నియంతను, ఆయనతో చేతులు కలిపిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు.
------ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శాసనసభపక్ష నేత