తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మంచులో చిక్కుకున్న పోలీసులు

జమ్ము కశ్మీర్​ కుల్గాం జిల్లాలో మంచుచరియలు విరిగిపడి 10 మంది పోలీసులు మంచులో చిక్కుకుపోయారు.

మంచుచరియల్లో చిక్కుకున్న 10 మంది పోలీసులు

By

Published : Feb 8, 2019, 12:35 PM IST

మంచుచరియల్లో చిక్కుకున్న 10 మంది పోలీసులు
కుల్గామ్​ జిల్లాలోని జవహర్​ సొరంగం సమీపంలోని ​పోలీస్​ పోస్ట్​ వద్ద మంచుచరియలు విరిగిపడి 10 మంది పోలీసులు చిక్కుకుపోయారు.

భారీగా కురుస్తోన్న మంచు, ఈదురు గాలులతో రక్షణ బృందాలు ఘటన స్థలానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు చరియల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీస్​ పోస్ట్​లో ఉన్న 20 మందిలో 10 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. మరో పది మంది వరకు మంచులో చిక్కుకుపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

జమ్ము కశ్మీరులో ఉన్న 22 జిల్లాల్లోని 16 జిల్లాల్లో మరో 24 గంటల వరకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details