ఎనిమిదికి చేరిన కుల్గాం మృతుల సంఖ్య
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలోని జవహార్ సొరంగం సమీపంలో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ప్రమాదంలో మరణించిన పోలీసు
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా జవహర్ సొరంగం పోలీసు పోస్టుపైకి మూడు రోజుల క్రితం భారీ మంచు మంచు చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరణించి వారిలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు ఉన్నారు.
పోలీసు పోస్టులోకి మంచు చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. అప్రమత్తమైన పది మంది పోలీసులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో పది మంది మంచు కింద చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరిని సిబ్బంది కాపాడారు.
Last Updated : Feb 10, 2019, 9:07 AM IST