తెలంగాణ

telangana

ETV Bharat / breaking-news

Dead bodies in pond: సద్దల చెరువులో రెండు మృతదేహాలు.. ఎవరివి? - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Dead bodies in pond
Dead bodies in pond

By

Published : Oct 31, 2021, 1:40 PM IST

Updated : Oct 31, 2021, 2:03 PM IST

13:37 October 31

చెరువులో రెండు మృతదేహాలు.. ఎవరివి?

సూర్యాపేటలోని ఓ చెరువులో మృతదేహాలు(Dead bodies in pond) తేలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. జిల్లాకేంద్రంలోని  సద్దల చెరువులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు... చెరువులో వేర్వేరు ప్రదేశాల్లో మృతదేహాలను గుర్తించారు.

ఓ మహిళ, వ్యక్తి మృతదేహాలు చెరువులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఎవరు..? మృతదేహాలు ఎక్కడివి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చెరువులో రెండు మృతదేహాల గుర్తింపు స్థానికంగా కలకలం రేపింది.

ఇదీ చదవండి:Ganja Smuggling: చెరువుకట్టపై గంజాయి పట్టివేత... ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అరెస్ట్‌

Last Updated : Oct 31, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details