జైడస్ క్యాడిలా ఉత్పత్తి చేసిన జైకొవ్-డి కొవిడ్ వ్యాక్సిన్ ధరను తగ్గించేందుకు ఆ సంస్థ(Zycov-D Vaccine Price) అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ధరను రూ.265గా నిర్ణయించినట్లు సమాచారం. వ్యాక్సిన్ ధరను తగ్గించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ఆ సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
సూది లేకుండానే ఇన్జెక్టర్ సాయంతో జైకొవ్-డి వ్యాక్సిన్ అందిస్తారు. ఈ ఇన్జెక్టర్ ధర రూ.93గా ఉంది. ఇన్జెక్టర్ ధర కూడా కలిపితే ఒక్కో డోసు(Zycov D Vaccine Dose) ధర రూ.358కు చేరనుంది. అంతకుముందు జైకొవ్-డి వ్యాక్సిన్ మూడు డోసుల ధరను రూ.1900గా ఆ సంస్థ నిర్ణయించింది. ఈ టీకా ఒక్కో డోసును(Zycov D Vaccine Dose) 28 రోజుల తేడాతో అందిస్తారు.