ఈ వారం (సెప్టెంబరు 12 - 18) రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు మీకోసం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
మంచి కాలం నడుస్తోంది. ధైర్యంగా ముందుకు సాగండి. అభీష్టసిద్ధి ఉంది. సకాలంలో పనులు అవుతాయి. ఉత్సాహం కలుగుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. సమస్యలను శాంతంగా పరిష్కరించండి. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం అందుతుంది. వ్యాపారలాభాలు గోచరిస్తున్నాయి. ఒక మంచిపని చేసి ప్రశంసలందుకుంటారు. సూర్యస్తుతి మేలు.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగరీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన కాలమిది. పెద్దలతో సామరస్యంగా వ్యవహరించాలి. చెడు ఆలోచించవద్దు. బాధ్యతగా పనిచేస్తే విఘ్నాలను తప్పించవచ్చు. తెలియని విషయాల్లో తల దూర్చవద్దు. ముఖ్యవ్యక్తుల సలహాలు పని చేస్తాయి. మొహమాటం పనికిరాదు. గణపతి స్మరణ మంచిది.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఉత్తమకాలం. అన్నివిధాలా మంచి జరుగుతుంది. అనేకమార్గాల్లో అభివృద్ధి కనపడుతుంది. ఆస్తులు పెరుగుతాయి. అదృష్టయోగం సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. మీవల్ల ఇతరులకు మంచి జరుగుతుంది. ఇష్టదేవతను తలచుకోండి, కీర్తి లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంతో పనులు ప్రారంభించండి, బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో బాగుంటుంది. ధన, గృహలాభాలు సూచితం. తోటివారి సూచనలతో మంచి జరుగుతుంది. విశ్రాంతి అవసరం. కొన్ని ప్రతిబంధకాలు ఇబ్బంది కలిగిస్తాయి. పెద్దల చొరవతో అవి పరిష్కారమవుతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ఆదిత్యహృదయం చదివితే మేలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఉత్తమకాలం నడుస్తోంది. పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితం వస్తుంది. గృహ సౌఖ్యమూ గౌరవమర్యాదలూ లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ధర్మనిష్ఠతో సుస్థిరమైన జీవితం ఏర్పడుతుంది. అధికారుల అండ లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇష్టదేవతను స్మరించండి, అంతా మంచే జరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)
మనోబలం, ఏకాగ్రత అవసరమైన సమయం. ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి. అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సహాయ సహకారాలు అంతగా లభించకపోవచ్చు. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. సంకల్పబలం పెరుగుతుంది.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఉద్యోగంలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అభీష్ట ఫలాలు అందుతాయి. ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. గృహ వాహనాది యోగాలున్నాయి. ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఒక విషయంలో నిరాశ చెందుతారు. ఆత్మీయుల ప్రమేయంతో అంతా సర్దుకుంటుంది. వ్యాపారంలో జాగ్రత్త. ఎవరినీ నమ్మవద్దు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ధ్యానిస్తే మేలు.
వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
శ్రేష్ఠమైన ఫలితాలు వస్తాయి. ప్రయత్నం బలంగా ఉండాలి. పూర్వ పుణ్యం గొప్పవారిని చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి కలుగుతుంది. సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆశయాలు నెరవేరే కాలమిది. బాధ్యతలను పూర్తి చేస్తారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ప్రశాంత జీవితం లభిస్తుంది. లక్ష్మీస్మరణతో శాంతి చేకూరుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆర్థికస్థితి కొంతవరకూ అనుకూలం. పని పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధంచేయండి. ఉద్యోగంలో ఆలోచించి పని చేయాలి. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. సమయానుకూలంగా ఏ పని ముందుచేస్తే మంచిదో ఆలోచించండి. అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. వృథా ఖర్చులు చేయవద్దు. నవగ్రహ శ్లోకాలు చదవండి, అంతా శుభమే జరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)
ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో చనువు పనికిరాదు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. దేనికీ తొందరవద్దు. సహనానికి పరీక్షా కాలం నడుస్తోంది. ఒత్తిడిలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ధైర్యంగా మీ బాధ్యతలను పూర్తిచేస్తే మంచి ఫలితం వస్తుంది. మనోబలం సదా కాపాడుతుంది. శివస్మరణ మంచిది.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
శుభఫలితం గోచరిస్తోంది. మనసుపెట్టి పని చేయండి. ఆశయసాధనలో శ్రమ పెరిగినా తగినంత ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల అండ లభిస్తుంది. సౌమ్య సంభాషణ గొప్పవారిని చేస్తుంది. కొందరివల్ల నిరుత్సాహం కలుగుతుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. పేరు ప్రతిష్ఠలుంటాయి. ఆదిత్యహృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగం బాగుంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. లక్ష్యాన్ని చేరేవరకూ విశ్రాంతి తీసుకోవద్దు. పట్టుదలతో పనిచేయండి. త్వరగా విజయం వస్తుంది. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. ఒత్తిడి కల్గించే పరిస్థితులున్నా ధర్మదేవత అనుగ్రహం ఉంది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.
ఇదీ చూడండి :పర్యావరణ హితం.. ఈ 'వృక్ష గణపతి' విగ్రహం!