ఈ వారం రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగరీత్యా అనుకూల కాలం నడుస్తోంది. సుఖసౌఖ్యాలుంటాయి. వ్యాపార బలం పెరుగుతుంది. అభివృద్ధికి అవసరమైన కొత్త ఆలోచనలు చేస్తారు. ఒక విషయంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా త్వరగా పని అవుతుంది. సమష్టి నిర్ణయంతో ఉత్తమ భవిష్యత్తును సాధిస్తారు. సూర్యధ్యానం శుభప్రదం.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఇష్టకార్యసిద్ధి విశేషంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పని చేసి అనుకూల ఫలితం పొందుతారు. కొన్ని సంఘటనలు ఆలోచింపచేస్తాయి. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి గోచరిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించాలి. సంతృప్తినిచ్చే వార్త ఒకటి వింటారు. మిత్రుల సహాయంతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. శివధ్యానం మనశ్శాంతిని ఇస్తుంది.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. కోరికలు కార్యరూపాన్ని దాలుస్తాయి. మనసుపెట్టి పని చేయండి. ఆర్థికంగా స్థిరపడతారు. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ఊహలకు పరిమితం అవకుండా బలంగా ప్రయత్నించాలి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. గృహ-వాహన-భూ యోగాలున్నాయి. ఇష్టదైవస్మరణ శ్రేయస్కరం.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
ఎదురుచూస్తున్న ఫలితం వస్తుంది. ఆనందంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంకల్ప బలాన్ని బట్టి కార్యసిద్ధి ఉంటుంది. ఆదాయ మార్గాలు అనుకూలం. నూతన అంశాలపై పనిచేయండి. సత్ఫలితం లభిస్తుంది. మనసుకు బాధ కలిగించే పరిస్థితులున్నాయి. ఉద్వేగానికి గురికావద్దు. పెద్దల సూచనలు శక్తినిస్తాయి. శివధ్యానం మేలుచేస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
జాగ్రత్తగా పనిచేస్తే కోరుకున్న ఫలితం పొందగలరు. అదృష్టయోగం పడుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది. ఒక విషయంలో ఇబ్బంది కలుగుతుంది. నిదానంగా ఆలోచించాలి. వారం మధ్యలో మంచి జరుగుతుంది. వ్యాపారపరంగా కొంతవరకు బాగుంటుంది. ఒత్తిడిని జయించాలి. కాలం ఆనందకరంగా గడుస్తుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)
ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. నిజాయతీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారంలో విశేషమైన లాభముంటుంది. తెలియని ఖర్చులను అదుపుచేయండి. శ్రేష్ఠమైన ఫలితాలు సాధించే కాలమిది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేసే శక్తి లభిస్తుంది. ఇష్టదేవతను దర్శించండి, ఆపదల నుంచి బయటపడతారు.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఉత్తమకాలం నడుస్తోంది. కోరికలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలుంటాయి. నిస్వార్థమైన బుద్ధితో చేసే పని శీఘ్రవిజయాన్నిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపార లాభముంటుంది. వేంకటేశ్వర స్వామిని స్మరించండి, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
పట్టుదలతో పనిచేయాలి. కాలం అంతగా సహకరించడం లేదు. విఘ్నాలు పెరుగుతాయి. కార్యసిద్ధికై నిరంతర సాధన అవసరం. ముఖ్యకార్యాల్లో జాగ్రత్త. తోటివారి సహకారం తీసుకోవాలి. వ్యాపారంలో కొంతవరకు అనుకూల ఫలితం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. సొంత నిర్ణయం మేలు. లలితా సహస్రనామం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
శుభయోగముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తే తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. వ్యతిరేకతను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. వ్యాపారంలో అవరోధాలను అధిగమించాలి. స్వయంకృషి ఫలిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆత్మీయుల సలహాలు పనిచేస్తాయి. ప్రశాంతత లభిస్తుంది. నారాయణ స్మరణ మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)
కోరిక నెరవేరుతుంది. ధన ధాన్యలాభం ఉంటుంది. సుఖసంతోషాలు పొందుతారు ఉద్యోగంలో ఉత్తమస్థితి గోచరిస్తోంది. వ్యాపారలాభం సూచితం. మిత్రుల అండతో ఆపదలు తొలగుతాయి. మోసం చేసేవారున్నారు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడండి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్త వింటారు. శివస్మరణ శక్తినిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆపదల నుంచి బయటపడతారు. అనుకున్న శుభ ఫలితం వస్తుంది. ఉద్యోగంలో కలిసివస్తుంది. అపోహలు తొలగుతాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. వ్యాపారరీత్యా అభివృద్ధి విశేషంగా గోచరిస్తోంది. తగినంత ప్రయత్నం చేయాలి. చేతి దాకా వచ్చిన ఒక పని ఆగుతుంది. ఆత్మీయుల సూచనలతో అంతా సర్దుకుంటుంది. ఇష్టదైవస్మరణతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యకార్యాల్లో శీఘ్రవిజయం ఉంటుంది. పట్టుదలతో పనిచేసి ఉద్యోగంలో సత్ఫలితాన్ని సాధిస్తారు. విశేషమైన గౌరవం లభిస్తుంది. నమ్మకమే ముందుకు నడిపిస్తుంది. ఆవేశపరిచేవారున్నారు. అపనిందలు ఉంటాయి. సమస్యలను తెలివిగా అధిగమించాలి. వారాంతంలో విజయం ఉంటుంది. సత్కార్యాలతో లాభపడతారు. ఇష్టదైవదర్శనం శుభప్రదం.
ఇదీ చూడండి :అగరబత్తి పుల్లలతో త్రీడీ అయోధ్య రామమందిరం