కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై(congress new president) నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు(congress news today). పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ)(cwc meeting news) సమావేశమైంది. ఈ సందర్భంగా సోనియా ప్రారంభ ఉపన్యాసం చేశారు.
జూన్ 30 నాటికే కొత్త అధ్యక్షుడిని(congress news) ఎన్నుకునేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసినప్పటికీ కరోనా రెండో దశ వల్ల వాయిదా పడిందని సోనియా గాంధీ అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారని, అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు.
పార్టీ నేతలు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబితే తాను అభినందిస్తానని.. కానీ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని సోనియా అన్నారు(congress news today). ఈ రోజు అన్ని విషయాలపై స్పష్టత తీసుకురాల్సిన సందర్భమొచ్చిందని చెప్పారు. నిజాయతీగా, స్వేచ్ఛగా అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు.