తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి వేదికగా ఉగ్రవాద నివారణ కమిటీ సమావేశం.. వాటిపైనే ప్రధాన చర్చ

భారత్​లో రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నివారణ కమిటీ. ఈనెల 28న ముంబయిలో, 29న దిల్లీలో ఈ సమావేశాలు జరగనున్నాయి.

un counter terrorism committee
un counter terrorism committee

By

Published : Oct 26, 2022, 7:18 PM IST

ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నివారణ కమిటీ భారత్‌లో రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాల్లో పాల్గొననుంది. ఈనెల 28న ముంబయిలో, 29న దిల్లీలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక భేటీలకు భారత అధికారులు అధ్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజయ్ వర్మ, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కాంభోజ్ తెలిపారు.

ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా వినియోగం, నిధుల సమకూర్పు, ఉగ్రవాదుల డ్రోన్‌ల వినియోగంపై ఈ సమావేశంలో పలు దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. 26/11 ముంబయి దాడుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించనున్నారు. భారీ విధ్వంసం జరిగిన తర్వాత కూడా ముంబయి ఆర్థిక నగరంగా నిలదొక్కుకోవడం అభినందనీయమని.. ఈ సందేశాన్ని అందించేందుకే ఈ సమావేశాలను ఇక్కడ నిర్వహిస్తున్నామని సంజయ్​ వర్మ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details