UPSC CDS 2022 Job Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) పరీక్ష కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 339 పోస్టుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పలు ఖాళీలున్నాయి. ఈ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జూన్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి. www.upsc.gov.in వెబ్సైట్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది.
విద్యార్హతలు-ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ల కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీలో అడ్మిషన్ల కోసం ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అడ్మిషన్ల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పాస్ కావాలి. (ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తప్పనిసరి)
ఇతర అర్హతలు-పెళ్లి కాని పురుషులు, మహిళలు మాత్రమే అప్లై చేయాలి.
వయస్సు-ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2004 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.