Unnatural Sex With Wife: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త అసహజ రీతిలో శృంగారం చేస్తున్నాడని ఆరోపించింది ఓ మహిళ. వ్యతిరేకించాలని చూస్తే.. క్రూరంగా కనికరం లేకుండా కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చాలా సార్లు కరెంట్ షాక్ పెట్టి హింసించాడని గోడు వెళ్లబోసుకుంది.
మురైనా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతికి.. గ్వాలియర్‌లోని ఇక్బాల్ అనే వ్యక్తితో 2021లో పెళ్లయింది. అప్పటి నుంచి తన భర్తతో శారీరకంగా వేధింపులు ఎదుర్కొంటోంది. సంవత్సర కాలంగా భరించి.. తప్పక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తన భర్త.. అసహజ శృంగారాన్నే ఇష్టపడతాడని, జంతువును చూసినట్లు చూస్తాడని ఆమె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.