తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2022, 8:41 PM IST

ETV Bharat / bharat

'పునర్విభజన తర్వాత కశ్మీర్​లో ఎన్నికలు జరిగి తీరుతాయ్​'

Amit shah: జమ్ముకశ్మీర్​లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగి తీరుతాయని స్పష్టం చేశారు.

union home minster amit shah on Assembly polls in Jammu Kashmir
'పునర్విభజన తర్వాత కశ్మీర్​లో ఎన్నికలు జరిగి తీరుతాయ్​'

Amit shah: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి తీరుతాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని.. అది పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా జమ్ముకశ్మీర్ జిల్లా సుపరిపాలన సూచికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్‌ షా విడుదల చేశారు.

జమ్ముకశ్మీర్‌పై ప్రధాని మోదీకి ప్రత్యేక దృష్టి ఉందన్నారు షా. అన్నిరకాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి ఉచ్చులో కశ్మీరీ ప్రజలు పడొద్దని సూచించారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌కు రూ.12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పర్యటకుల రాకతో అవి మరింత పెరుగుతాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details