తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో భారీ సభలకు మమత దూరం

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం భారీ బహిరంగ సభలను నిర్వహించబోమని బంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. చిన్న సమావేశాలను ఏర్పాటు చేయడం సహా తన ప్రసంగ సమయాన్ని కుదించుకున్నట్లు వివరించారు.

Trinamool Congress, rise in COVID cases
తృణమూల్ కాంగ్రెస్, కరోనా కేసులు

By

Published : Apr 19, 2021, 9:27 AM IST

కొవిడ్ విజృంభణ దృష్ట్యా కోల్​కతాలో చిన్న సమావేశాలను మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు. మిగిలిన మూడు విడతల ఎన్నికల కోసం జిల్లాల్లో తన ప్రసంగ వ్యవధిని గంట నుంచి సుమారు 20 నిమిషాలకు కుదిస్తున్నట్లు స్పష్టంచేశారు. దాంతో సభల్లో ప్రజలు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

"వచ్చే మూడు దశల పోలింగ్​ కోసం వీధుల్లో చిన్న చిన్న సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భారీ బహిరంగ సభలను నిర్వహించబోము. నా ప్రసంగం కూడా మునుపటిగా కన్నా తక్కువ వ్యవధిలో ఉంటుంది."

- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

శాసనసభ ఎన్నికల వేళ బంగాల్​లో కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 8,419 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,59,927కి చేరింది. మరో 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు 10,568 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చూడండి:రెమ్‌డెసివిర్‌పై 'మహా' జగడం!

ABOUT THE AUTHOR

...view details