దేశంలోని కరోనా మళ్లీ కోరలు చూస్తున్న తరుణంలో.. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతి కొవిడ్ కేసుకు సంబంధించి 25-30 మందిని కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కేసుల పెరుగుదలతో సంబంధం లేకుండా.. ప్రతి జిల్లాకు ఒక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపింది. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
"వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నప్పుడు.. బాధితులను, ఆయా వ్యక్తి కుటుంబాలను మాత్రమే క్వారంటైన్లో ఉంచితే సరిపోదు. కంటెయిన్మెంట్ జోన్ల విస్తృతిని పెంచాలి. స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలి."