కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. రాజ్యసభలో సాగు చట్టాలపై తోమర్ ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియజేశారన్నారు. తోమర్ ప్రసంగిస్తున్న వీడియోను తన ట్విట్‌కు జోడించిన ప్రధాని.. ఆ ప్రసంగం అందరూ వినాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయశాఖ మంత్రిపై ప్రధాని ప్రశంసలు - వ్యవసాయ చట్టాలపై తోమర్
రాజ్యసభలో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తోమర్ ప్రసంగాన్ని ప్రజలందరూ వినాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ మంత్రినిపై ప్రధాని ప్రశంసలు
వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ తోమర్ చేసిన ప్రసంగంలో.. చట్టాలను సవరించేందుకు కేంద్రం సిద్ధమైనంత మాత్రాన చట్టాల్లో లొసుగులు ఉన్నట్లు కాదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'చట్టాల్లో సవరణలకు సిద్ధమంటే.. లొసుగులు ఉన్నట్లు కాదు'