కేబుల్ కార్కు రిపేర్.. గాల్లోనే పర్యటకులు .. అనేక గంటలు నరకం!
Ropeway accident: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ పర్యటక కేంద్రంలోని రోప్‌వేలో సాంకేతిక సమస్య తలెత్తింది. 11 మంది ఉన్న కేబుల్ కారు గాల్లోనే నిలిచిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి అందరినీ కాపాడాయి.
Timber trail ropeway accident: హిమాల్ప్రదేశ్ సోలన్ వ్యాలీలోని పర్వానూ టింబర్ ట్రెయిల్ రోప్‌వే ఎక్కిన పర్యటకులు.. అనేక గంటలపాటు ప్రత్యక్ష నరకం చూశారు. సాంకేతిక సమస్యతో కేబుల్ కార్ మధ్యలోనే నిలిచిపోగా.. అందులోని 11 మంది ప్రయాణికులు గాల్లోనే చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. వెంటనే ఇద్దరిని సురక్షితంగా కాపాడాయి. కేబుల్ కారులో ఉన్న మిగతా 9 మందిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. గంటల పాటు శ్రమించి అందరినీ సురక్షితంగా కిందకు దించాయి.
ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, కేబుల్ కారులోని పర్యటకులంతా సురక్షితంగా ఉన్నారని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఓంకార్ చాంద్ శర్మ వెల్లడించారు.