వచ్చే ఏడాది మార్చి, మే నెలల నాటికల్లా గడువు ముగిసే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (elections of india 2022) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. దానిలో భాగంగా.. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 23 మధ్య వేర్వేరు తేదీల్లో గోవా, మణిపుర్, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు, మే 14వ తేదీ నాటికి ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి గడువు ముగుస్తుంది. ఆ తేదీల్లోపు ఆ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలి. జనవరి చివరి వారంలో షెడ్యూల్‌ను (2022 elections in india) ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికలతో నేరుగా సంబంధం ఉండే అధికారులు వారి సొంత జిల్లాల్లో కానీ, మరే జిల్లాలోనైనా మూడేళ్లుగా పనిచేస్తుంటే వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఏదైనా కోర్టులో కేసు విచారణలో ఉన్న అధికారులను ఎన్నికల సంబంధిత విధుల్లోకి తీసుకోవద్దని తెలిపింది.
షెడ్యూల్ విడుదలయ్యేలోపు పార్లమెంటు సమావేశాలు