తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Tension at Punganur in Chandrababu Tour: రావణకాష్టంలా పుంగనూరు.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

Tension at Punganur in Chandrabau Tour: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనను.. వైసీపీ మూకలు రణరంగంగా మార్చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు విసరడంతో.. చాలా మందికి గాయాలయ్యాయి. పర్యటనలో అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. అంగళ్లులో తెలుగుదేశం బ్యానర్లు వైసీపీ శ్రేణులు చించివేయడంతో.. ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఘర్షణలో వైసీపీ మూకలు రాళ్ల దాడి చేయడంతో.. టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పుంగునూరు పుడింగి సంగతి తేల్చే వెళ్తానని చంద్రబాబు దూకుడుగా యాత్రను సాగించారు.

Tension_at_Punganur_in_Chandrabau_Tour
Tension_at_Punganur_in_Chandrabau_Tour

By

Published : Aug 4, 2023, 9:04 PM IST

Updated : Aug 4, 2023, 10:51 PM IST

రావణకాష్టంలా పుంగనూరు

Tension at Punganur in Chandrabau Tour: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంగళ్లులో వైసీపీ శ్రేణులు దాడులతో తీవ్ర ఉద్రిక్తతనెలకొంది. చంద్రబాబు పర్యటనలో.. సందర్భంగా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. కురబలకోట మండలం అంగళ్లులో.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా.. తెలుగుదేశం శ్రేణులు పెద్దఎ్తతున పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. బ్యానర్లు చించివేస్తున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే సమయంలో ఘర్షణ మొదలైంది.

ALSO READ:రణరంగంగా మారిన పుంగనూరు.. టీడీపీ శ్రేణులకు గాయాలు.. పలు వాహనాలు ధ్వంసం..

YCP leaders attacked TDP leaders..తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ మూకలు మరింతగా రెచ్చిపోయి దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు.. చెదరగొడుతున్నా వాళ్లేదురుగానే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడికి దిగారు. ఈ దాడిలో.. మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంగళ్లు గ్రామానికి చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు ఓ పక్క రెచ్చిపోతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు.

ALSO READ:వినుకొండ ఘటన.. 200మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు

Police lathi charge on TDP leaders..చంద్రబాబు తన యాత్రను అంగళ్లులో ముగించుకుని పుంగనూరుకు వెళ్తుండగా అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంగళ్లు నుంచి ఓపెన్ టాప్ జీప్ పైనుంచి ర్యాలీగా వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ వెంట భారీగా టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. చంద్రబాబు వెళ్లే మార్గంలో వైసీపీ శ్రేణులు లారీలు అడ్డుపెట్టడంతో వాటిని తొలగించాలని తెలుగుదేశం కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇదే అదునుగా తెలుగుదేశం శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేశారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.. బాష్పవాయువు ప్రయోగించారు.

ALSO READ:అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!

Chandrababu reaction on incident.. బాంబులకే భయపడలేదని.. రాళ్లకు భయపడతానా అని చంద్రబాబు అంగళ్లు ఘటనపై తీవ్రంగా మండిపడ్డాడరు. పెద్దిరెడ్డి లాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీని యూనిఫామ్ తీసేయాలని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. గాయపడిన కార్యకర్తలకు చికిత్స చేయించాలని సూచించారు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు.. ఈ రావణాసురుడికి ఎమ్మెల్యే ట్యాగ్‌ ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు అందరు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నేను పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలని మండిపడ్డారు.

ఈరోజు విధ్వంసానికి కారణం పెద్దిరెడ్డి, పోలీసు యంత్రాంగం. ఇవాళ్టి ఘటనపై విచారణ జరిపించాలి. నేను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా?పుంగనూరు రోడ్డు మీ తాత జాగీరా? ప్రజలు తిరగబడితే మీరు పారిపోతారు. వైకాపా పోయే పార్టీ.. ఆ పార్టీ నేతలకు పోగాలం వచ్చింది. నెత్తురోడుతున్నా నిలబడిన కార్యకర్తలను అభినందిస్తున్నా. చల్లా బాబుపై దెబ్బపడితే నాపై పడినట్లే. మీ నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా.. నా నుంచి కారినట్లే. పుంగనూరులో ఎన్నో అరాచకాలు జరిగాయి. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించా. ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా. అధికార పార్టీకి దాసోహం కావద్దని పోలీసులను కోరుతున్నా. ఇవాళ్టి సంఘటనలకు బాధ్యుడు ఎస్పీనే.

పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబును పోలీసులు అనుమతించ లేదు. శివారులోనే ఓపెన్‌ టాప్‌ వాహనంపై మాట్లాడి.. అక్కడి నుంచి నేరుగా పూతలపట్టు వెళ్లిపోయారు.

Last Updated : Aug 4, 2023, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details