తెలంగాణ

telangana

ఆ 10 రాష్ట్రాల్లోనే 72% కరోనా కొత్త కేసులు

By

Published : May 13, 2021, 3:22 PM IST

దేశవ్యాప్తంగా గురువారం కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్​ కేసుల్లో 10 రాష్ట్రాల్లోనే 72 శాతం కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా మరణాలు రేటు 1.09శాతంగా ఉన్నట్లు చెప్పింది. మరోవైపు.. ఇప్పటివరకు 17.72 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

corona in india
10 రాష్ట్రాల్లో కరోనా కేసులు

గురువారం కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో.. 10 రాష్ట్రాల్లోనే 72.42 శాతం కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, బంగాల్​, రాజస్థాన్​, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, రాష్ట్రాలు ఉన్నాయని చెప్పింది. గురువారం కొత్తగా 3,62,727 మందికి కొవిడ్​ నిర్ధరణ అయినట్లు పేర్కొంది.

మహారాష్ట్రలో అత్యధికంగా..

కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 46,781 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఆ తర్వాత కేరళలో 43,529 మందికి, కర్ణాటకలో 39,998 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

దేశంలో మొత్తం 37,10,525 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కరోనా కేసుల్లో 15.65 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు ప్రస్తుతం 1.09శాతంగా ఉంది. గురువారం కొత్తగా 4,120 మంది.. కరోనా ధాటికి బలయ్యారు. మహారాష్ట్రలో కొత్తగా 816 మంది కరోనా కారణంగా చనిపోగా.. కర్ణాటకలో 516 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కొత్తగా 3,52,181 మంది.. కోరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 1,97,34,823కు చేరింది.

వ్యాక్సినేషన్​ ఇలా..

ఇప్పటివరకు 17,72,14,256 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. గురువారం కొత్తగా 18,94,991 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 9,284 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు, 7,033 ఆక్సిజన్​ సిలిండర్లు, 19 ఆక్సిజన్​ ప్లాంట్లు, 5,993 వెంటిలేటర్లు, 3.44 లక్షల రెమ్​డెసివిర్​ వయల్స్​ను అందజేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:వ్యాక్సినేషన్​కు కొత్త రూల్స్- మీరూ తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details