ETV Bharat / health

సూపర్​ : ఈ బ్యూటీ టిప్స్​ పాటిస్తే - నలభైలో కూడా ఇరవైలా కనిపిస్తారు! - Fashion Tips to Look Like Young

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 2:24 PM IST

Fashion Tips : అందంగా, యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. పలు కారణాల వల్ల ఇరవై ఏళ్ల వారు కూడా నలభై ఏళ్ల వారిలా కనిపిస్తారు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే యంగ్​గా కనిపించ వచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Fashion Tips
Fashion Tips (ETV Bharat)

Best Fashion Tips to Look Like Young : పెరుగుతున్న వయసుకుతోడు వివిధ రకాల కారణాలతో.. చాలా మంది తమ ఏజ్​ కంటే పెద్దవారిలా కనిపిస్తారు. అయితే.. కొన్ని టిప్స్​ పాటించడం వల్ల యంగ్​గా కనిపించొచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హెయిర్ స్టైల్స్​: అందంగా కనిపించాలంటే ముఖం నీట్​గా ఉండటం ఎంత ఇంపార్టెంటో.. హెయిర్ స్టైల్స్​ కూడా అంతే ముఖ్యం. మీ లుక్స్​ని హెయిర్​ స్టైల్స్ బాగా డామినేట్ చేస్తాయి. ఎందుకంటే.. మీరు అందంగా కనిపించాలన్నా.. అందవిహీనంగా కనిపించాలన్నా వీటి పాత్రే ఎక్కువ. కాబట్టి మీరు చేయాల్సినదల్లా హెయిర్​ స్టైల్స్​పై ఎక్కువ శ్రద్ధ చూపించడం. అందుకని.. మీ ముఖానికి ఏ హెయిర్ స్టైల్​ బాగా సూట్​ అవుతుందో గుర్తించి.. వాటిని ట్రై చేయాలి. జుట్టును స్టైల్ చేయడం, కర్ల్స్ చేయడం వంటివి చేస్తూ ఉంటే.. ఇవి మీరు యంగ్​గా కనిపించేలా చేస్తాయి. మధ్యపాపిడి తీస్తే.. మీరు వయసుకన్నా పెద్దవారిగా కనిపిస్తారు. సైడ్ పార్టీషన్స్ కాస్త యంగ్​లుక్ ఇస్తాయని నిపుణులు అంటున్నారు.

ప్రెగ్నెన్సీ తర్వాత అందం తగ్గిపోయిందా? - ఈ టిప్స్‌ పాటిస్తే మీ బ్యూటీని తిరిగి పొందొచ్చు! - Beauty Tips After Delivery

మేకప్..: ట్రెండీగా రెడీ అయ్యేవారు మేకప్​పై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాగే సంప్రదాయంగా ఉండేవారు కూడా కొన్ని రెగ్యూలర్​గా ఫాలో అవ్వాలి. సంప్రదాయ దుస్తులు వేసుకున్నప్పుడు ముఖానికి కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. ఇది మీ లుక్​ని బెటర్​ చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ముఖానికి తగ్గట్లుగా బొట్టు సైజ్ ఉండాలని.. పెద్ద బొట్టు పెట్టుకుంటే అది హుందాగా కనిపించినా.. మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చిన్న సైజ్​ బొట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదంటున్నారు.

దుస్తులు: కొన్ని దుస్తులు మీకు కంఫర్ట్​గా ఉండొచ్చు కానీ.. మిమ్మల్ని పెద్దవారిగా చూపిస్తాయంటున్నారు. రౌండ్ నెక్స్ మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి క్లోజ్డ్ నెక్ డ్రెస్​లు లేదా షర్ట్​లు ట్రై చేయమంటున్నారు. అలాగే కుర్తాలు వేసుకుంటే దుప్పటాను రెండు సైడులు కాకుండా వన్​ సైడ్​ వేసుకుంటే యంగ్​గా కనిపిస్తారని చెబుతున్నారు. అంతేకాకుండా మీ స్కిన్ టోన్​కి సెట్ అయ్యే రంగుల దుస్తులు ఎంచుకోవాలంటున్నారు. ఇవి కూడా మీరు అందంగా కనిపించండంలో మేజర్ పాత్ర పోషిస్తాయి.

స్కిన్ కేర్ రోటీన్: యంగ్​గా కనిపించాలంటే ఉదయం, సాయంత్రం కచ్చితంగా స్కిన్​ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలని నిపుణులు అంటున్నారు. ఇవి ముఖంపై మురికిని, పింపుల్స్​ని దూరం చేసి.. మెరిసే, అందమైన లుక్​ని ఇస్తాయంటున్నారు. స్కిన్​కేర్ ఫాలో అవ్వడం వల్ల ముడతలు కూడా దరి చేరవని.. కాబట్టి పడుకునే ముందు కచ్చితంగా మొహంపై మేకప్​ లేకుండా చూసుకోమంటున్నారు. అలాగే వారానికి రెండుసార్లైనా ఎక్స్​ఫోలియేటింగ్ చేయడం వల్ల ముఖంలో మంచి గ్లో వస్తుందని చెబుతున్నారు.

లైఫ్​ స్టైల్: కొందరు శరీరంపై కొంచెం కూడా శ్రద్ధ వహించరు. ఏది పడితే అది తింటుంటారు. అయితే అలాంటివారు తినే విషయంలో, బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బరువు ఎక్కువగా ఉన్నారనిపిస్తే దానిని తగ్గించుకునేందుకు ట్రై చేయమంటున్నారు. రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తే.. బరువు తగ్గడంతో పాటు.. మొహంలో సహజమైన గ్లో వస్తుందని.. ఇది యవ్వనంగా ఉండేలా చేస్తుందంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. పలువురు నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

అందాల హీరోయిన్ అదితి బ్యూటీ సీక్రెట్స్ ఇవేనట - ఇవి పాటిస్తే అద్దిరిపోయే అందం మీ సొంతం! - Aditi Rao Hydari Beauty Secrets

ఫస్ట్​టైమ్​ మేకప్​ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్​ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.