tea fluff artist: ప్రతి భారతీయుడు రోజుకు సుమారు నాలుగు కప్పుల టీ తాగుతారు. అందుకే ఛాయ్ భారతీయుల జీవితంలో భాగమైపోయింది. తేయాకుకు అంతటి ప్రాముఖ్యత ఉంది. తేయాకే కాదు.. దానిని శుద్ధి చేయగా మిగిలిపోయిన వ్యర్థాలతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది ఓ యువతి. తేయాకు వ్యర్థాలతో వివిధ మీడియా సంస్థలు, బ్రాండ్ల లోగోలు తయారు చేసి ఔరా అనిపించింది. ఆమే ఉత్తర్ప్రదేశ్, వారణాసికి చెందిన రోష్ని యాదవ్.
ఇప్పటికే వివిధ మీడియా సంస్థలు, బ్రాండ్లకు చెందిన 365 లోగోలు తయారు చేసి యురేషియా వరల్డ్ రికార్డు నెలకొల్పంది రోష్ని. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సమయంలో చేసిన సేవలకు గౌరవంగా ఈటీవీ భారత్ లోగోను తయారు చేసింది.
తేయాకు వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసిన లోగోలను రోషిణి యాదవ్.. భాదైని ఆదర్శ్ శిక్షా మందిర్లో ప్రదర్శనకు ఉంచారు. దీనిని అంతర్జాతీయ కళాకారిణి నేహా సింగ్ ప్రారంభించారు.
"వివిధ సంస్థల లోగోల తయారీలో ఒకే రంగును ఉపయోగించా. అది దేశంలో వివిధ ప్రజలు, సంస్కృతులు ఉన్నా వారంతా భారతీయులమనే భావనను తెలియజేస్తుంది. కరోనా మహమ్మారి కాలంలో మీడియా సంస్థలు చేసిన సేవలకు గౌరవంగా వాటి లోగోలను రూపొందించా. లాక్డౌన్ సమయంలోనే ఈ లోగోలు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది."