అంగవైకల్యం ఉన్నా స్విమ్మింగ్‌లో కింగ్ Specially Abled Kerala Boy Swims: ఏదైనా సాధించాలన్న పట్టుదల ముందు అంగవైకల్యం అడ్డు రాదని నిరూపించాడు కేరళకు చెందిన యువకుడు. ఈత నేర్చుకున్న రెండు వారాల్లోనే నదిని ఈదేశాడు.
పెరియార్ నదిలో ఈత కొడుతున్న అసీమ్ వసీమ్ ఈత కొడుతున్న దృశ్యాలను తిలకిస్తున్న ప్రజలు కోజికోడ్ జిల్లా వెలిమన్నా గ్రామానికి చెందిన మహమ్మద్ అసీమ్‌కు(15) పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కాళ్లు కూడా నడిచేందుకు సమానంగా లేవు. కానీ స్విమ్మింగ్‌పై తనకున్న ఆసక్తిని మాత్రం వదల్లేదు. కేవలం 14 రోజుల్లోనే ఎంతో కష్టపడి ఈత నేర్చుకున్నాడు.
గంటలో కిలోమీటరు ఈది..
గంటలో కిలోమీటరు దూరం పెరియార్ నదిలో ఈదుతూ నది అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ దృశ్యాలను చూసిన కోజికోడ్ ఎమ్మెల్యే, గ్రామస్థులు అసీమ్‌పై పూలమాలలు వేసి సత్కరించారు.
మీడియాతో మాట్లాడుతున్న మహమ్మద్ వసీమ్ "నాకు స్విమ్మింగ్‌లో శిక్షణ ఇచ్చినందుకు కోచ్‌కు ధన్యవాదాలు. దివ్యాంగ పిల్లలు లోపాల గురించి దిగులుపడకుండా అందరిలానే జీవించాలి" అని అన్నాడు అసీమ్.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:కేంద్రం కీలక నిర్ణయం.. వారు కూడా టీకాకు అర్హులే!