తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ ఏడాది సాధారణ వర్షపాతమే.. దక్షిణాదిన మాత్రం..

Southwest Monsoon in India: దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

imd monsoon
నైరుతి పవనాలు

By

Published : Apr 14, 2022, 2:12 PM IST

Southwest Monsoon in India: నైరుతి రుతు పవనాల కారణంగా దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయవ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వెల్లడించింది.

  • గత మూడేళ్లలో కూడా భారత్‌లో నైరుతి రుతు పవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతు పవనాలకు సంబంధించి మే నెలాఖరులో వాతావరణ శాఖ మరింత స్పష్టత ఇస్తుంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య గల కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు.

ABOUT THE AUTHOR

...view details