సినీ నటుడు సోనూసూద్ (Sonu sood).. దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'దేశ్ కా మెంటర్స్ (Desh ka mentors)' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ ప్రకటన చేశారు. పేద విద్యార్థులు తమకు ఇష్టమైన కేరీర్‌ను ఎంచుకునేందుకు చెప్పేవారు ఉండరని, అలాంటి వారికి మార్గదర్శనం చేసే ఉద్దేశంతో దేశ్ కా మెంటర్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు.
'దేశ్ కా మెంటర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ - సోనూ సూద్‌కు మరో బాధ్యత
దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'దేశ్ కా మెంటర్స్ (Desh ka mentors)' కార్యక్రమానికి సినీ నటుడు సోనూసూద్(Sonu sood)ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ మేరకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అధికారిక ప్రకటన చేశారు.
సోనూ సూద్, కేజ్రివాల్
దిల్లీ సీఎంతో సోనూసూద్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో.. దేశ్ కా మెంటర్ కార్యక్రమం గురించే తప్ప రాజకీయాలపై చర్చించలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Last Updated : Aug 27, 2021, 2:15 PM IST