తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యూపీఏ ఛైర్​పర్సన్'గా పవార్​.. ఊహాగానాలే

యూపీఏ ఛైర్​పర్సన్​ బాధ్యతలను తాను చేపడతున్నానంటూ వస్తున్న వార్తలను ​ఖండించారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్. మీడియా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని అన్నారు.

NCP chief
మీడియా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోంది:శరద్​ పవార్​

By

Published : Dec 11, 2020, 9:55 PM IST

యూపీఏ కూటమికి సారథ్యం వహించబోతున్నారంటూ తనపై వస్తున్న వార్తలను నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ) అధినేత శరద్​ పవార్ ఖండించారు. మీడియా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ పార్టీ అధిష్ఠానం బలహీనపడిందంటూ.. శివసేన నేత సంజయ్​ రౌత్​ చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే శరద్​ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"యూపీఏ ఛైర్​పర్సన్​ బాధ్యతలను శరద్​ పవార్​ చేపడితే మేము చాలా సంతోషిస్తాం. కానీ, ఆయన దానికి అంగీకరించలేదని తెలిసింది. ఒకవేళ ఆయన దానికి అధికారికంగా అంగీకరిస్తే మేము మద్దతు తెలుపుతాం. కాంగ్రెస్​ ప్రస్తుతం చాలా బలహీనపడింది. ప్రతిపక్షాలు ఏకమై యూపీఏను శక్తిమంతం చేయాలి."

- సంజయ్​ రౌత్​, శివసేన నేత.

అంతకుముందు.. ఈ వార్తలు నిరాధారమైనవేనని ఎన్​సీపీ స్పష్టం చేసింది. ఈ విషయమై యూపీఏ పక్షాల మధ్య ఎలాంటి చర్చ జరగలేదని ఎన్​సీపీ అధికార ప్రతినిధి మహేశ్​​ తపాసీ పేర్కొన్నారు. రైతు ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి కథనాలను వండి వార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:రైతుల సహనాన్ని పరీక్షించొద్దు: పవార్​

ABOUT THE AUTHOR

...view details