ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. జులై 31న జరగాల్సిన ఈ పరీక్షను(SBI clerk exam 2021) వాయిదా వేసింది. అయితే పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.
ఎస్బీఐ క్లర్క్ జూనియర్ అసోసియేట్ ప్రిలిమ్స్ పరీక్ష(SBI clerk prelims exam)ను జులై 10-13 మధ్య నిర్వహించింది. మొత్తం 5000 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు పరీక్ష జరగ్గా.. ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశముంది.
ఈ ఉద్యోగం సంపాదించేందుకు అభ్యర్థులు.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్యూలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. చివరిగా మెరిట్ లిస్ట్‌లో పేరు వచ్చినవారిని దేశంలోని వివిధ బ్రాంచీల్లో నియమిస్తుంది ఎస్బీఐ.
ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్(SBI clerk mains exam)లో 190 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు sbi.co.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి:ఫ్రెషర్స్‌కు శుభవార్త.. 20వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం!