తెలంగాణ

telangana

ETV Bharat / bharat

61 ఏళ్ల వయసులో 'నీట్​' పాస్​.. ఎంబీబీఎస్ సీటు త్యాగం

Retired teacher pass in NEET: 61 ఏళ్ల వయస్సులో నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఎంబీబీఎస్​ సీటు సాధించారు ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు. అయితే.. చివరి నిమిషంలో తన ఎంబీబీఎస్​ సీటును వదులుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు.

Retired teacher pass in NEET
భార్యతో పాటు కౌన్సెలింగ్​కు హాజరైన ఉపాధ్యాయుడు

By

Published : Jan 28, 2022, 7:39 PM IST

Retired teacher pass in NEET: 61 ఏళ్ల వయస్సులో నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఎంబీబీఎస్​ సీటు సాధించారు ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు. తమిళనాడులోని ధర్మపురికి చెందిన 61 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు కె.శివ ప్రకాశత్‌ నీట్‌లో ఉత్తీర్ణత సాధించి విద్యాభ్యాసానికి వయసు ఆటంకం కాదని నిరూపించారు.

విశ్రాంత ఉపాధ్యాయుడు కె.శివ ప్రకాశత్‌

తమిళనాడులో ఎంబీబీఎస్​, బీడీఎస్​, వైద్య విద్య కోర్సులకు కౌన్సెలింగ్​ జనవరి 27 నుంచి ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు 7.5 కోటాలో కౌన్సెలింగ్​ శుక్రవారం నిర్వహించారు. గతేడాది నీట్ పరీక్ష రాసిన ధర్మపురికి చెందిన కే శివ ప్రకాశత్​ విద్యార్థులతో కలిసి శుక్రవారం కౌన్సెలింగ్​లో పాల్గొన్నారు. ఇదే కౌన్సెలింగ్​కు ఆయన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు సైతం ఉండటం గమనార్హం.

భార్యతో పాటు కౌన్సెలింగ్​కు హాజరైన ఉపాధ్యాయుడు

అయితే చివరి నిమిషంలో యువతరానికి అవకాశం ఇవ్వాలన్న సత్‌ సంకల్పంతో ఆయన ఎంబీబీఎస్​ సీటు వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయుడి పట్టుదలకు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:స్మార్ట్​ కిడ్.. 10 ఏళ్ల వయసులోనే లాయర్ల కోసం యాప్​ తయారీ

ABOUT THE AUTHOR

...view details