Retired soldier murdered his wife: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు భర్త. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన హరియాణాలోని సిర్సాలో జరిగింది. దీంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బరాగూడ గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు గుర్మెల్ సింగ్కు మొదటి వివాహం జరగగా భార్య మరణించింది. తర్వాత మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, గత కొంత కాలంగా తన భార్య ప్రవర్తనను అనుమానిస్తున్నాడు. ఇదే విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గుర్మెల్.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తరఫు బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.