కేరళలో నామినేషన్ల తిరస్కరణను సవాలు చేస్తూ ఎన్డీఏకి చెందిన ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేశాక.. తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఆ ముగ్గురు ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురు
రిటర్నింగ్ అధికారి తమ నామపత్రాలను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కేరళ హైకోర్టు ఆశ్రయించిన ముగ్గురు ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేశాక తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ న్యాయస్థానం వారి పిటిషన్ను తోసిపుచ్చింది.
ఆ ముగ్గురు ఎన్డీఏ అభ్యర్థులకు హైకోర్టులో చుక్కెదురు
ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలస్సేరి, గురవాయూర్, దేవికుళం నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు భాజపా నుంచి ఇద్దరు, అన్నాడీఎంకే నుంచి ఒకరు నామినేషన్ వేశారు. అయితే నిబంధనలకు అనుగుణంగా లేవని రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. దీనిని సవాలు చేస్తూ కేరళ హైకోర్టును వారు ఆశ్రయించారు.
ఇదీ చూడండి:25 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి
TAGGED:
kerala highcourt latest news