తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాకేశ్ టికాయిత్​కు బెదిరింపు- మరో రైతు నేత హత్యకు కుట్ర!

Rakesh Tikait News: బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​కు మరోసారి బెదిరింపు కాల్స్​ వచ్చాయని ఆయన భద్రత సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై గాజియాబాద్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Rakesh Tikait News
రాకేశ్ టికాయిత్ బెదిరింపు కల్స్​

By

Published : Dec 5, 2021, 9:09 PM IST

Rakesh Tikait News: భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​కు మరోసారి బెదిరింపు కాల్స్​ వచ్చాయి. దీనిపై గాజియాబాద్‌లోని కౌశాంబి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫోన్​కాల్​ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. టికాయిత్ భద్రతలో నిమగ్నమైన ఉత్తర్​ప్రదేశ్​ పోలీసు సిబ్బంది నితిన్‌కు ఈ మేరకు ఫోన్​కాల్​ వచ్చినట్లు పేర్కొన్నారు. నిందితుడు మొదట అసభ్యంగా మాట్లాడి.. ఆపై చంపేస్తానని బెదిరించాడని.. అయితే దాని వెనుకున్న ఉద్దేశాన్ని బయటపెట్టలేదని చెప్పారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జీ సచిన్​ మాలిక్​ తెలిపారు. బెదిరింపునకు సంబంధించిన ఆడియో క్లిప్​ను టికాయిత్​ ద్వారా అందుకుని.. దాని ఆధారంగా తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు.

టికాయిత్​కు గతంలో కూడా పలుమార్లు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి.

మరో నేత హత్యకు కుట్ర

మరో బీకేయూ నేత, టికాయిత్​ సన్నిహితుడు జయ మాలిక్​ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఘాజీపుర్ సరిహద్దులో టికాయిత్​ నిర్వహిస్తున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మాలిక్​ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కిషోర్, సోనూలను పోలీసులు అరెస్ట్​ చేశారు. డిసెంబరు 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ్చచింది. మోదీనగర్‌కు చెందిన వీర్​సేన్​, సంజయ్‌ ప్రధాన్​ ఈ కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. ఈ పని కోసం పెరోల్‌పై వచ్చిన కిషోర్​, సోనూలకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చారని చెప్పారు.

నిందితులను రెండు రోజుల క్రితం భోజ్‌పుర్‌లో పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితులపై కాల్పులు జరిపారు అధికారులు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వీర్​సేన్​, సంజయ్ ​ప్రధాన్​లను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details