తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్​ఆర్​బీ పరీక్షలను నిలిపివేసిన రైల్వే- వారికి వార్నింగ్

Railway Recruitment: ఆశావహుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ, లెవల్​ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Railway suspends NTPC, Level 1 exams
Railway suspends NTPC, Level 1 exams

By

Published : Jan 26, 2022, 10:50 AM IST

Railway Recruitment: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ, లెవల్​ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డుల(ఆర్​ఆర్​బీ) పరిధిలో జరిగిన పరీక్షల్లో పాస్​, ఫెయిల్​ అయినవారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ.. రైల్వే శాఖకు నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు.

బిహార్​లో పెద్ద ఎత్తున నిరసనలు..

RRB NTPC: రైల్వే రిక్రూట్​మెంట్​పై అసంతృప్తితో దేశంలోని పలు చోట్ల అభ్యర్థులు.. నిరసనలు చేపట్టారు. బిహార్​లో రైల్వే ట్రాక్​లపై చేరి ఆందోళనలు చేశారు. కొన్ని చోట్ల హింస చెలరేగింది.

రైళ్లను అడ్డుకొని నిరసనకారుల ప్రదర్శన
నిరసనకారులను చెదరగొట్టేందుకు భారీగా చేరుకున్న భద్రతా సిబ్బంది

నిరసనకారులు రైళ్లను తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు.. లాఠీఛార్జి కూడా చేశారు.

నిరసనకారులు రాళ్లు రువ్వుతుంటే లాఠీఛార్జి చేసిన పోలీసులు
బిహార్​లో రైలును తగలబెట్టిన ఆందోళనకారులు

ఈ నేపథ్యంలో.. నిరసనల సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని భవిష్యత్తులో ఎంపిక చేయబోమంటూ రైల్వే శాఖ హెచ్చరించింది.

రైల్వే ట్రాక్​లపైకి పెద్ద ఎత్తున చేరిన నిరసనకారులు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:పద్మభూషణ్​ అవార్డును తిరస్కరించిన బంగాల్ మాజీ సీఎం

రాచరికపు సంకెళ్లు తెంచుకొని.. భారతావని ఉదయించిన వేళ..

ABOUT THE AUTHOR

...view details