సన్నిహితులు, పాత్రికేయ ప్రముఖులు సహా మరికొంత మందిని ట్విట్టర్లో అన్‌ఫాలో చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆయన అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం తెలియరాలేదు. దాదాపు 50 ఖాతాలను అనుసరించడం మానేసినట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం.. కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఆయన అన్‌ఫాలో చేసిన అకౌంట్లలో.. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, తరుణ్ గొగొయి ఖాతాలూ ఉన్నాయి.