ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. హెలికాప్టర్లో తిప్పుతానని పిల్లలకు మాట ఇవ్వగా.. ఇప్పడు దానిని నిజం చేశారు రాహుల్. అన్నట్లుగానే శనివారం ఆ విద్యార్థులను ఆకాశంలో తిప్పాడు.
మాట నిలబెట్టుకున్న రాహుల్.. విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పి.. - భారత్ జోడో యాత్ర లేటెస్ట్ అప్డేట్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన చేసిన ఆ ఒక్క పనితో చిన్నారుల ముఖంలో చిరునవ్వులు విరిసాయి. ఇంతకీ ఆయన ఏం చేశారంటే?
ఇదీ జరిగింది: భారత్ జోడో యాత్రలో భాగంగా నవంబర్ 29న మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చేరిన రాహుల్ అక్కడున్న ఓ ప్రభుత్వ పాఠశాల చిన్నారులతో ముచ్చటించారు. వారిలో కొంత మందిని తమ జీవిత లక్ష్యాలను అడగగా వారు పైలట్ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. అయితే మీరెప్పుడైనా విమానంలో ప్రయాణించారా అని రాహుల్ అడగగా.. వారు లేదని సమాధానం ఇచ్చారు. దీంతో మిమ్మల్ని త్వరలోనే హెలికాప్టర్లో తిప్పుతానని మాట ఇచ్చారు రాహుల్.
అలా బుధవారం 10,11వ తరగతి విద్యార్థులను పిలిపించిన రాహుల్ వారితో పాటు ప్రిస్సిపల్ను సైతం హెలికాప్టర్లో తిప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు వారందరిని తిప్పించారు.. ఆ సమయంలో హెలికాప్టర్ గురించి చిన్నారులకు వివరించారు. బుధవారం జరిగిన ఈ హెలికాప్టర్ ప్రయాణాన్ని తాము ఎన్నడు మరచిపోమని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ రైడ్ నుంచి తిరిగి వచ్చాక చిన్నారులు రాహుల్కు ఓ పేయింటింగ్ను బహుకరించారు.