తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అదానీ ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పగలరా?' - అదానీపై రాహుల్ విమర్శ

అదానీ సంస్థల ఛైర్మన్​ గౌతమ్ అదానీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలు విలవిలలాడిపోయిన వేళ అదానీ తన సంపదనను 50శాతం ఎలా పెంచుకోగలిగారని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

rahul criticizes gautam adani over wealth surge
అదానీ ఆస్తులు భారీగా పెరగటంపై రాహుల్ ఫైర్

By

Published : Mar 13, 2021, 6:10 PM IST

అదానీ సంస్థల ఛైర్మన్​ గౌతమ్ అదానీ సంపద వృద్ధిపై వచ్చిన వార్తలపై స్పందించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలు విలవిలలాడిన వేళ అదానీ తన సంపదనను 50శాతం ఎలా పెంచుకోగలిగారని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

'2020లో మీ సంపద ఎంత పెరిగింది?' అని రాహుల్​ ప్రజలను ప్రశ్నించారు. అయితే ప్రజల ఆస్తి ఏమీ పెరగలేదని అన్నారు. ప్రజలంతా బతకడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గౌతమ్‌ అదానీ 12లక్షల కోట్ల రూపాయలను సంపాదించారని పేర్కొన్నారు. 'దానికి కారణం ఏమిటో చెప్పగలరా?' అని అడిగారు.

ABOUT THE AUTHOR

...view details