ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని ఓ కళాకారుడు.. అద్భుత కళాఖండాన్ని రూపొందించాడు. అగ్గిపుల్లలను ఉపయోగించి.. 1870 నాటి అరుదైన సైకిల్ మోడల్‌ను ఆవిష్కరించాడు.
పూరీ జిల్లాకు చెందిన శాశ్వత్ రంజన్ సాహూ అనే 18 ఏళ్ల యువకుడు.. 7 రోజుల పాటు శ్రమించి ఈ కళారూపాన్ని తయారు చేశాడు. 3,653 అగ్గిపుల్లలతో 50 అంగుళాల పొడవు, 25 అంగుళాల వెడల్పుతో దీన్ని రూపొందించాడు. 1870 నుంచి 1880 మధ్య కాలంలో వినియోగించిన ఈ మోడల్ సైకిల్ ధర.. అప్పట్లో కేవలం కొద్ది పైసలు మాత్రమే ఉండేది.
అందరూ సైకిల్ వాడాలి..
సైకిళ్ల వాడకంపై అందరికీ అవగాహన కల్పించేందుకే తాను ఈ బొమ్మను రూపొందించానని సాహూ చెప్పాడు. కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుతం తరుణంలో సైకిల్‌ను ఉపయోగించటమే ఉత్తమమైన మార్గం అని తెలిపాడు.