తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Yaas: తుపాను ప్రభావంపై మోదీ సమీక్ష

యాస్ తుపాను ప్రభావంపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు మోదీ. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.

Prime Minister Narendra Modi reviews Yaas Cyclone impact
Yaas: తుపాను ప్రభావంపై మోదీ సమీక్ష

By

Published : May 27, 2021, 6:41 PM IST

తూర్పు తీరంలో విరుచుకుపడిన యాస్ తుపాను(Cyclone Yaas) ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేయాలని ఆదేశించారు. తుపాను సహాయక చర్యల సనద్ధత సహా నష్టం అంచనాలను ప్రధానికి అధికారులు వివరించారు.

ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ, విద్యుత్, టెలికాం శాఖల కార్యదర్శులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ డీజీ ఇతర ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు.

మోదీ పర్యటన

తుపాను ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో మోదీ శుక్రవారం పర్యటించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు రాష్ట్రాల్లో సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని పేర్కొంది. ఏరియల్ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది.

బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రా​లను కుదిపేసిన యాస్ తుపాను కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 21 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇవీ చదవండి-

cyclone yass: ముంచెత్తిన వర్షం- ఏరులా మారిన ఊరు

ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లో 'యాస్​' బీభత్సం

ABOUT THE AUTHOR

...view details