ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. కొవిడ్ మూడో దశ వస్తే.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవడమే గాక, వ్యాక్సినేషన్(Corona Vaccination) వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రి సహా కీలక అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
భారత్‌లో ఇంకా కరోనా రెండో దశ(Covid Second Wave) ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పిన మరునాడే మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని 35 జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా 10శాతంపైనే ఉందని రాజేశ్ పేర్కొన్నారు. మరో 30 జిల్లాలో ఇది 5-10 శాతంగా ఉందని తెలిపారు.
మరోవైపు.. దేశంలోని వయోజనులలో సగం మంది కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నారు. 18 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. మొత్తంగా 72 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:కొవిడ్ వ్యాక్సినేషన్ స్టేటస్ క్షణాల్లో తెలుసుకోండిలా..