ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన దిల్లీ సర్కారు కన్నా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు కల్పించే.. జాతీయ రాజధాని ప్రాదేశిక సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది.
'దిల్లీ' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు కల్పించే.. 'దిల్లీ' బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
'దిల్లీ' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
'దిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్' బిల్లును గతవారం పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకించగా.. దిల్లీ ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణను తీసుకువచ్చామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:'అమిత్ షా-పవార్ల మధ్య భేటీ జరగనేలేదు'