పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై సుప్రీంకోర్టు.. సోమవారం మరోసారి విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను కొనసాగించనుంది. పెగసస్ వివాదంపై విచారణ కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేయాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
ఈ పిటిషన్‌పై ఆగస్టు 10న విచారణ జరిపిన ధర్మాసనం.. " కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరగడం దురదృష్టకరం, కోర్టులు జరిపే విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలి" అని వ్యాఖ్యానించింది.